మహిళల ప్రిమియర్ లీగ్-2026లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నదైన్ డి క్లార్క్(63*) పరుగులతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. అరుంధతి రెడ్డి 20, గ్రేస్ హారిస్ 25, స్మృతి మంధాన 18 రన్స్ చేశారు.