అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఐక్య విద్యార్థి యువజన సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రశ్నించిన నాయకులపై కేసులు, రౌడీషీట్లు పెట్టడాన్ని ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రౌడీషీట్లు వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.