కడప నగరంలోని శిల్పారామంలో ఈనెల 11వ తేదీ ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు ఏఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు. పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.5 వేలు అందజేయనున్నట్లు చెప్పారు. కన్సోలేషన్ బహుమతులు కూడా ఉంటాయని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.