NLR: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఈ నెల 10 నుంచి 12 వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రజల సహాయం కోసం వారికి అధికారులు అందుబాటులో ఉండానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సహాయం కోసం 0861-2331261, 7995576699, 1077 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.