SRPT: ప్రతి గ్రామంలో మౌళిక వసతులు కల్పిస్తామని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 11వ వార్డు నంద్యాలగూడెంలో మున్సిపల్ నిధులు రూ. 3 లక్షలతో బోరు మోటార్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల స్థానిక నాయకులు మంచి నీటి సమస్యను తీర్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు వెంటనే నిధులను మంజూరు చేయించారు.