PLD: మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, వంగవీటి రాధాకృష్ణ ,ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కలిసి శుక్రవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల సమస్యలపై రంగా చూపిన తెగువ నేటికీ ఆదర్శనీయమని, ఆయన పేదల గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటారని వారు కొనియాడారు.