SRPT: కోదాడలోని శ్రీమన్నారాయణ కాలనీలో శుక్రవారం జయవరపు పరమేశ్వరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ముగ్గుల పోటీలు, హరిదాసు కథలు, భోగి మంటలతో సందడిగా సాగింది. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జయవరపు నరేందర్ నేతృత్వంలో వరుసగా ఆరో ఏడాది ఈ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరయ్యారు.