ADB: విద్యతో పాటు నైపుణ్యం కలిసినప్పుడే యువత జీవితంలో స్థిరత్వం, గౌరవం లభిస్తాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం తాంసి మండల కేంద్రంలో షిర్డీ సాయి సేవా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. యువత భవిష్యత్తు అభివృద్ధికి నైపుణ్య శిక్షణలు కీలకమని, ఇవి వారి కలలకు వేదికగా నిలుస్తాయని అన్నారు.