మెదక్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతులు, ఎర్తింగ్ పనుల కారణంగా శని, ఆదివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేస్తున్నట్లు ఏడీఈ మోహన్ బాబు, ఏఈ నవీన్ తెలిపారు. కావున విద్యుత్ వినియోదారులు సహకరించాలని వారు కోరారు.