NLG: మునుగోడు నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, మర్రిగూడెం మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు.