VZM: వికసిత్ భారత్ గ్యారెంటీ రోజగార్ ఆజీవిక మిషన్ (VBGRAAM) ద్వారా గ్రామీణ ప్రజలకు విస్తృత ఆర్థిక లబ్ధి చేకూరుతుందని MGNREGS డైరెక్టర్ షణ్ముఖ్ తెలిపారు. స్థానిక ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమలుకు విజయనగరం జిల్లాను పైలట్‌గా ఎంపిక చేసినట్లు చెప్పారు. ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 125కు పెరుగుతాయన్నారు.