MDK: నార్సింగి మండలం వల్లూరు శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం స్థానిక పెట్రోల్ పంపు సమీపంలో ఓ వ్యక్తి అచేతన స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.