ATP: స్వాతంత్య్ర ఉద్యమాలు చేసి జాతి ఉనికిని చా టుకున్న గొప్ప వ్యక్తి వడ్డె ఓబన్న అని వడ్డెర నాయకులు పేర్కొన్నా రు. ఆదివారం గుత్తి పట్టణంలోని వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్ అండ్‌బీ బంగ్లా నుంచి వడ్డె ఓబన్న చిత్రపటాన్ని పట్టణంలోని పురవీధుల గుండా బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.