KMR: బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన, అల్లం ప్రభులింగం అనే వ్యక్తి ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో అంతక్రియల ఖర్చుల నిమిత్తం SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు ఉన్నారు.