ఏలూరు గిరిజన భవన సమావేశ మందిరంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి ఎస్టీ ఉద్యోగుల సంఘ డైరీని ఆదివారం ఆవిష్కరించారు. 1-10వ తరగతి నిరుపేద విద్యార్థులకు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యకు పేదరికం అడ్డు రాకూడదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సదుపాయాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.