ఢిల్లీలో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి వృద్ధ దంపతులు రూ.14.85cr పోగొట్టుకున్నారు. ఐరాస రిటైర్డ్ ఉద్యోగులైన వీరిని 17 రోజులు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మనీలాండరింగ్ కేసులున్నాయని, అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని నకిలీ పోలీసులు వీడియో కాల్స్‌లో బెదిరించి డబ్బు గుంజారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.