అన్నమయ్య: గుర్రంకొండ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన శశికళ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రశేఖర్-శశికళ దంపతులు తమ కుమార్తెతో కలిసి బైక్‌పై రెడ్డమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా, పార్లపల్లి సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయింది. గాయపడిన శశికళను మొదట జిల్లా ఆస్పత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం కోలార్‌కు తరలించారు.