SRCL: రైతాంగం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో మహాలక్ష్మీ రైతు సంఘం ఆధ్వర్యంలో కాటిరేవుల కార్యక్రమం నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.