SKLM: కవిటి మండలం ఆర్ బెలగాం జడ్పీ ఉన్నత పాఠశాలలో 2008-2009 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇవాళ జరిగింది. సుమారు 17 ఏళ్ల తర్వాత విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో పాఠశాల ప్రాంగణమంతా సందడిగా మారింది. చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు పలకరించుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ సందడి చేశారు.