JGL: ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, మెట్పల్లి ప్రధాన రహదారిలోని రైల్వేగేట్ వద్ద బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చినట్లు బీజేపీ మండల నాయకులు గంగాధర్ తెలిపారు. రైల్వే ట్రాక్ వద్ద రైళ్ల రాకపోకల సమయాల్లో గేటు వేసిన ప్రతిసారి అరగంటకు పైగానే వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.