PLD: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్ర – తెలంగాణ సరిహద్దులోని దాచేపల్లి వద్ద పండుగ కళ ఉట్టిపడుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని తమ సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో అద్దంకి – నార్కెట్పల్లి హైవే కిక్కిరిసిపోయింది. రంగురంగుల కార్లు భారీ సంఖ్యలో బారులు తీరడంతో, ముందస్తుగానే సంక్రాంతి వచ్చిందా అన్నట్లుగా హైవే అంతా సందడిగా మారింది.