అనంతపురం హౌసింగ్ బోర్డులో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ముగ్గుల సంప్రదాయం ఇంటి పరిశుభ్రతకు చిహ్నమని వివరించారు.