శ్రీకాకుళం: పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.