KNR: డ్రైవింగ్ లైసెన్స్ లేని యువతీ, యువకులు వీణవంక పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న లైసెన్స్ మేళాను ఉపయోగించుకోవాలని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. లైసెన్స్ లేని 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకుల కోసం నేటి నుంచి ఈనెల 22 వరకు లైసెన్స్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.