JN: చిల్పూర్ మండలంలోని లింగంపల్లి సమ్మక్క- సారక్క జాతరకు సంబంధించి టెండర్ ప్రక్రియను సోమవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, తలనీలాలు పోగు చేసుకోవడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ధరావత్తు సొమ్ము చెల్లించి టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.