విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ క్రింద మురుగు నీరు నిరంతరంగా ప్రవహిస్తోంది. దీంతో దుర్వాసనతో పాటు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. పాదచారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే శుభ్రపరిచి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.