ATP: తాడిపత్రి మండలం తేరన్నపల్లిలో వెలిసిన శ్రీ పెద్దమ్మతల్లి జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల కోలాహలం, మొక్కుబడులతో సందడిగా మారింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.