ఉద్యోగం కోసం మయన్మార్ వెళ్లి చిక్కుకున్న 27 మంది(AP 8, TG 2) భారతీయులు క్షేమంగా దేశం చేరుకున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ చొరవతో బాధితులను విదేశాంగశాఖ స్వస్థలాలకు తరలించింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ముఠా మయన్మార్ తీసుకెళ్లిందని.. అక్కడ తమను సైబర్ నేరాలకు వాడుకునేవారని బాధితులు పేర్కొన్నారు. అంతా క్షేమంగా ఇళ్లకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.