MDC: కీసర పరిసర ప్రాంతాలలో భూగర్భ జలం ప్రస్తుతం పుష్కలంగా ఉన్నట్లు TGGWRD తెలిపింది. పరిసర ప్రాంతాల్లో సుమారుగా 3.5 నుంచి 5 మీటర్ల లోతులో భూగర్భ జలం లభ్యమవుతున్నట్లు పేర్కొంది. ప్రతి ఒక్కరు వర్షపు నీటిని ఒడిసి పట్టడం కోసం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని భూగర్భ జల శాఖ ఇంజనీర్ సుధాకర్ గ్రామ ప్రజానికానికి సూచించారు.