HNK: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులకు చైనా మాంజా వినియోగించడం వల్ల మనుషులు, పక్షులు, జంతువులకు తీవ్ర హాని కలుగుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం NSS ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక హెచ్చరించారు. ఈ నేపథ్యంలో NSS ఆధ్వర్యంలో HNKలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాలు, పర్యావరణ హానిని విద్యార్థులకు వివరించారు.