MDCL: GHMC కమిషనర్ ఆదేశాల మేరకు బోడుప్పల్ సర్కిల్ వార్డుల్లో ఈ నెల 12, 13 తేదీలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ చేపడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ శైలజా తెలిపారు. ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న పాత ఎలక్ట్రానిక్ వస్తువులను కాలనీల్లో ఏర్పాటు చేసిన ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాల్లో అందజేయాలని కోరారు. ఈ-వేస్ట్ సరైన నిర్వహణతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు.