MNCL: మొక్కజొన్న సాగులో రైతులు జాగ్రత్తగా పాటించాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ సూచించారు. శుక్రవారం కవ్వాల్ గ్రామంలో మొక్కజొన్న పంటలను సందర్శించి రైతులకు సూచనలు చేశారు. మొవ్వు పురుగు, కత్తెర పురుగుల ఉధృతిని తగ్గించటానికి రైతులు వేప నూనె పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లకవత్ సక్రు, వంగ శ్రీను, అయ్యూబ్ ఖాన్ పాల్గొన్నారు.