KNR: కనీస వేతనాలకు వీబీ-జీ రామ్ జీ చట్టం ద్వారా పూర్తి రక్షణ లభిస్తుందని, పాత ఎంజీఎన్ఆర్జీఏ చట్టాన్ని ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగార్చడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన బూత్ నిర్మాణ అభియాన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతోనే దిద్దుబాటు చర్యలు చేపట్టామని తెలిపారు.