MDK: రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి హెచ్చరించారు. గ్రామంలో మద్యపాన నిషేధానికి గ్రామసభఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని, మద్యం విక్రయాలను పట్టించిన వారికి రూ.10 వేల నజరానా అందజేస్తామని ఆమె ప్రకటించారు.