KMM: ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో రూ. 3.17 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పట్టణంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించామన్నారు.