AP: CM చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. కోడి పందాలు జూదంగా చూడొద్దని అంటున్నారని.. ఎన్నికలకు ముందు ఇది సంప్రదాయం అన్నారని గుర్తు చేశారు. వాళ్ల పార్టీ MLA ఒకరు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారని చెప్పారు. MLA, మంత్రులు కోళ్లకు కత్తులు కట్టి ఫొటోలు దిగుతారని పేర్కొన్నారు. అక్కడ జరిగేది జూదమేనని.. కానీ ఎవరిపైనా కేసులు ఉండవన్నారు.