విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టిందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. లెగసీ వేస్ట్ తొలగింపు, నగరాన్ని ఇల్యూమినేషన్ సిటీగా మార్చడం, భోగాపురం రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈనెల 24–31 వరకు విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని చెప్పారు.