HNK: వంగాలపల్లి WDCA మైదానంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ-20 క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో కరీంనగర్ జట్టు వరంగల్ జట్టుపై 9 పరుగుల తేడాతో విజయం సాధించగా, 2వ మ్యాచ్లో నిజామాబాద్ జట్టు మెదక్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించినట్లు WDCA కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.