SDPT: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్‌గా రష్మీ పెరుమాళ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీపీ విజయ్ కుమార్ ఎస్బీ జాయింట్ సీపీగా బదిలీ అయ్యారు. ఇటీవలే డీఐజీగా పదోన్నతి పొందిన విజయ్ కుమార్ జిల్లాలో బెల్టు షాపులు, అక్రమ వ్యాపారాల నిర్మూలనకు కృషి చేయడంతో పాటు సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి గుర్తింపు పొందారు.