చిరంజీవితో కలిసి నటించడం నిజంగా అద్భుతమైన అనుభూతి అని మరో అగ్ర కథానాయకుడు వెంకటేష్ అన్నారు. మహేష్, పవన్‌లతో కలిసి మల్టీస్టారర్ చేశానని చెప్పిన ఆయన.. ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు అనిల్‌తో తనది మంచి కాంబినేషన్ అని, ఈ సినిమాకు మంచి టీమ్ పనిచేసిందన్నారు. ఈ సంక్రాంతికి మంచి ఎంటర్టైన్ ఫిల్మ్ రాబోతోందన్నారు.