AP: సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై, వారి కుటుంబ సభ్యులపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు సతీమణిపై విష్ణు బొట్ల అనే వ్యక్తి అనుచిత పోస్టులు చేశాడు. దీంతో టీడీపీ మహిళా నాయకురాలు లీలావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం కుటుంబానికే రక్షణ లేకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.