చిరంజీవి, వెంకటేష్ కలిసి నటిస్తే చూడాలని ఎంతో మంది డ్రీమ్ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ‘నాది 8 సినిమాల ప్రయాణం. చిరంజీవితో 9వ మూవీ. ఏదైనా సినిమా మొదలు కావాలంటే, కథ ముఖ్యం. ఒక కథను పుట్టించడం చాలా కష్టం. వెంకటేష్ నాకు స్నేహితుడు, మార్గదర్శి, అంతకుమించి. మీరు ఎంజాయ్ చేస్తారు. కుదిరితే పుల్ లెంగ్త్ సినిమా చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.