సత్యసాయి: పెనుకొండలో రూ. 425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటుతో 4,035 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుందని వెల్లడించారు. పెనుకొండలో ఘనగిరి లక్ష్మీనరసింహా స్వామి ఆలయం ఉన్న కొండపై ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక క్యాంపును ఏర్పాటు చేస్తామన్నారు.