కోనసీమ: గ్రామాలలో మంచినీరు, పారిశుధ్యం, వీధిలైట్లు నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో రాజేశ్వరరావు ఆదేశించారు. కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ అధికారులు, సిబ్బంది గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.