అన్నమయ్య: 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 12వ తేదీ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు రామాంజులు తెలిపారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డీఆర్వో మధుసూదన్‌రావుకు సమ్మె నోటీస్ అందజేశారు. జీవో 49 ప్రకారం పూర్తి వేతనం అమలు చేయాలన్నారు.