KDP: కడప నగర మేయర్ శ్రీ పాక సురేష్ కుమార్ మార్నింగ్ విజిట్లో భాగంగా పాత మార్కెట్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీ బండి నిత్యానంద రెడ్డి గారు పాల్గొన్నారు. పర్యటనలో పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై అధికారులకు సూచనలు చేశారు. రెవెన్యూ అధికారి కన్నయ్య, ఎంహెచ్ఓ, YCP నాయకులు జమిల్ తదితరులు హాజరయ్యారు.