SRPT: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్న వాహనదారులకు జిల్లా ఎస్పీ నరసింహ పువ్వులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ.. అవసరమైన జాగ్రత్తలు సూచించారు. ప్రజలు పండుగను సురక్షితంగా జరుపుకుని, ప్రమాదాలు లేకుండా స్వస్థలాలకు చేరుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంతో జిల్లా పోలీస్ శాఖ వారు పాల్గొన్నారు.