కృష్ణా: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాల స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అందరిదేనని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. శనివారం పెనమలూరు గ్రామంలో ఆక్రమణలో ఉన్న 3.5 ఎకరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థలాన్ని క్రమబద్ధీకరించి, సొంత నిధులతో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామస్తుల సహకారంతో కాంపౌండ్ వాల్ నిర్మించినట్లు తెలిపారు.