KMM: వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇజ్జగాని సత్యం ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి ఇవాళ సత్యం స్వగృహానికి చేరుకొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 50 వేల ఆర్థిక సహాయం అందజేసి ఎల్లవేళల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.