SRD: కంగ్టి మండలం తడ్కల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల భవన నిర్మాణం నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు మన బడి’లో మంజూరైన రూ.1 కోటి నిధులతో 2022 జూన్ 5న మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే, ఈ భవన పనులు ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ, ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.